
ఉన్నత విద్యా వికాసానికి పత్రికలు తోడ్పాటు ఇవ్వాలని ఉన్నత విద్యామండలి సేకరేటరి ప్రొ. శ్రీరామ్ వెంకటేష్ కోరారు.అయిన తన కార్యాలయంలో నవ తెలంగాణ జర్నలిస్టు ,ఓయూ పీహెచ్డీ స్టూడెంట్ తలారి.శ్రీనివాసరావు తో కలిసి నవ తెలంగాణ నూతన సంవత్సర క్యాలెండర్స్ ఆవిష్కరించారు. సీఎం రేవంత్ రెడ్డి చేయూత తో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలతో అనేక సంస్కరణలు చేపట్టనున్నట్లు చెప్పారు. విద్యార్థులకు ఉపాధి కల్పన కోసం నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నట్లు పరిశ్రమలకు,మార్కెట్ కు అనుగుణంగానే కోర్సులు, డిజైన్ చేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు నూతన ఇన్నోవేషన్స్ ఆవిష్కరణ లతో ముందుకు పోవాలని సూచించారు. రాష్ట్ర ప్రజలకు,మేధావులకు, విద్యావేత్తలకు, నవ తెలంగాణ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.