ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఎంపికపై హర్షం..

నవతెలంగాణ – బెజ్జంకి 
పార్లమెంట్ లో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఎంపికవ్వడం హర్షనీయమని కాంగ్రెస్ నాయకుడు, న్యాయవాది చింతలపల్లి జనార్ధన్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2029లో ప్రధానిగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపడుతాడని జనార్ధన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.