- డీలర్ల కోసం పోటీయుతమైన. సరళమైన నియమాలను అందిస్తున్న అనుకూలమైన ఫైనాన్సింగ్ పరిష్కారాలు
నవతెలంగాణ హైదరాబాద్ : తమ డీలర్ నెట్ వర్క్ కోసం సమగ్రమైన ఛానల్ ఫైనాన్సింగ్ పరిష్కారాలు కేటాయించడానికి హెచ్ఎస్ బీసీ ఇండియాతో వ్యూహాత్మకమైన భాగస్వామాన్ని జేఎస్ డబ్ల్యూ ఎంజి మోటార్ ఇండియా ప్రకటించింది. ఈ సహకారం జేఎస్ డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా డీలర్లకు పోటీయుత షరతులతో సమగ్రమైన డీలర్ ఫైనాన్సింగ్ పరిష్కారాన్ని అందిస్తోంది. హెచ్ఎస్ బీసీ ఇండియా వారి నైపుణ్య ప్రయోజనం పొందడం జేఎస్ డబ్ల్యూ ఎంజీ మోటార్ డీలర్ నెట్ వర్క్ కోసం పని మూలధనాన్ని సులభంగా పొందగలిగే సదుపాయం కల్పిస్తుంది. వివిధ రకాల మరియు అనుకూలమైన ఫైనాన్సింగ్ ఆప్షన్స్ తో, ఈ సహకారం కార్యకలాపాల సామర్థ్యాన్ని పెంచుతుంది, వ్యాపార సుస్థిరతను ప్రోత్సహిస్తుంది మరియు డీలర్ భాగస్వాముల కోసం దీర్ఘకాలం వృద్ధి అవకాశాలను ప్రోత్సహిస్తుంది. భాగస్వామం పైన వ్యాఖ్యానిస్తూ, సతీందర్ సింగ్ బాజ్వా, ఛీఫ్ కమర్షియల్ ఆఫీసర్, జేఎస్ డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా మాట్లాడుతూ… “మా డీలర్ భాగస్వాములకు సాధికారత కల్పించడంలో హెచ్ఎస్ బీసీతో మా సహకారం గణనీయమైన చర్యగా నిలిచింది. మా డీలర్ భాగస్వాములకు ఉత్తమమైన వనరులు, మద్దతు కేటాయించి, తద్వారా పరస్పర విజయాన్ని ప్రోత్సహించడానికి మా కొనసాగుతున్న ప్రయత్నాలకు ఈ వ్యూహాత్మకమైన భాగస్వామం ఒక నిరూపణ. భారతదేశంలో హెచ్ఎస్ బీసీ వారి అంతర్జాతీయ నైపుణ్యం మరియు శక్తివంతమైన భౌగోళిక ఉనికి మా అభివృద్ధి ప్రయాణంలో ఒక ఆదర్శవంతమైన భాగస్వామిని చేసింది“ అని అన్నారు. ” గౌరవ్ సహగల్, కంట్రీ హెడ్ బిజినెస్ బ్యాంకింగ్, హెచ్ ఎస్ బీసీ ఇండియా మాట్లాడుతూ “ అన్ని ముఖ్యమైన ఛానల్ భాగస్వాముల కోసం ఆర్థిక పరిష్కారాలు అందచేయడంలో జేఎస్ డబ్ల్యూ ఎంజి మోటార్ ఇండియాతో మా భాగస్వామం ఒక వ్యూహాత్మకమైన చర్యను సూచిస్తోంది. ఫైనాన్సింగ్ కు నిరంతర యాక్సెస్ ను కలిగించి మరియు మార్కెడ్ డిమాండ్లకు మరింత ప్రభావవంతంగా ప్రతిస్పందించడానికి అనుకూలమైన వాతావరణాన్ని ప్రోత్సహించడమే మా లక్ష్యం. జేఎస్ డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియాతో మా దీర్ఘకాల సంబందాన్ని మరింత శక్తివంతం చేయడానికి ఇది మరొక మైలురాయి.” ఇలా అన్నారు.