స్టాక్స్‌ విభజనకు జేటీఎల్‌ ఇండిస్టీస్‌ ఆమోదం

హైదరాబాద్‌ : బ్లాక్‌ స్టీల్‌ పైపులు, స్టీల్‌ ట్యూబ్‌ల తయారీదారు జేటీఎల్‌ ఇండిస్టీ తమ షేర్లను విభజించినట్టు ప్రకటించింది. ఒక్క షేర్‌కు మరో షేర్‌ను అందించడానికి 1:1కు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. దీంతో రూ.2 ముఖ విలువ కలిగిన షేర్‌ను రూ.1గా విభజించింది. దీనికి సంబంధించిన రికార్డ్‌ తేదిని ప్రకటించలేదు. మంగళవారం ఈ కంపెనీ షేర్‌ 4.84 శాతం పెరిగి రూ.217.50 వద్ద ముగిసింది.