ఎస్సి వర్గీకరణ సుప్రీంకోర్టు ప్రకటనపై హర్షం

నవతెలంగాణ -మల్హర్ రావు:
ఎస్సి వర్గీకరణ న్యాయమైన డిమాండ్ అంటూ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్టాలకు ఉందని, సుప్రీంకోర్టు కోర్టు ప్రకటన పట్ల ఎమ్మార్పీఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం విజయాన్ని గెలిచిన సందర్భంగా గురువారం మండల కేంద్రమైన తాడిచెర్లలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి, కేకు కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి కేశారపు నరేశ్ మాదిగ,ఎమ్మార్పీఎస్ నాయకుడు అక్కపాక సమ్మయ్య, అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తాండ్ర మల్లేష్,మంథని సమయ్య మాదిగ,బిజెపి పార్టీ అసెంబ్లీ కన్వీనర్ మల్క మోహన్ రావు,బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు ముడతనపల్లి ప్రభాకర్,పోలోజు సత్యనారాయణ,బూడిద సతీష్ మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఇందారపు ప్రభాకర్ మాదిగ, నారమళ్ళ నవీన్ మాదిగ ఎంఎస్ఎఫ్ అధ్యక్షుడు ఇందారపు సిద్దు మాదిగ, ఖమ్మంపెళ్లి సందీప్ మాదిగ పిఎసిఎస్ వైస్ చైర్మన్ మల్క ప్రకాష్ రావు, దేవనని రాజేశ్వరరావు,కేసారపు రాజయ్య, తుంగపల్లి సాత్విక్ నారమల్ల రాజయ్య, కేసారపు బాలయ్య ఇందారపు రాజేష్ ,ఇందారపు మల్లేష్, ఇందారపు అరుణ్, ఇందారపు కుమార్ ,ఇందారపు హేమంత్ పాల్గొన్నారు.