నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్ :
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ పార్లమెంటు సభ్యులు వెంకటస్వామి జయంతి వేడుకలను గురువారం హుస్నాబాద్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టిపిసిసి సభ్యులు కేడం లింగమూర్తి మాట్లాడుతూ కాకా అంటే కరీంనగర్ పెద్దపెల్లి ముద్దుబిడ్డ వెంకటస్వామి పేరు తెలియని వారు లేరన్నారు. ఆయన ఆశయ సాధన కోసం తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బంక చందు కాంగ్రెస్ నాయకులు ఏండి హసన్ మడప యాదవ రెడ్డి, వెన్న రాజు, పోతుగంటి బాలయ్య, బూరుగు కృష్ణస్వామి, బికే నాయక్, ఎదునూరి సుధాకర్, బూరుగు సతీష్, రాధక్క, బందేల హరీష్ బాబు, తిరుపతి, రంజిత్ కుమార్, వేల్పుల సంపత్, పంపరి సంపత్ తదితరులు పాల్గొన్నారు.