సీఎం వ్యాఖ్యలకు జూడా ఖండన

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అర్హత లేని నకిలీలకు శిక్షణనిచ్చి సర్టిఫికెట్‌ ఇచ్చే విషయమై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తెలంగాణ జూనియర్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ (టీజూడా) ఖండించింది. ఈ మేరకు మంగళవారం టీజూడా అధ్యక్షులు డాక్టర్‌ సాయిహర్ష, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ జె.ఐజాక్‌ న్యూటన్‌ తదితరులు ఒక ప్రకటన విడుదల చేశారు. అర్హత లేని వారితో ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ యాక్ట్‌ను ఆమలు చేయాలని కోరారు. మెడికల్‌ సీట్లు పెరిగిన నేపథ్యంలో ప్రజారోగ్య పరిరక్షణకు అర్హులైన వైద్యుల సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు.