– ప్రాణాలను కాపాడే వైద్యులపై ఇలాంటి ఘటనలు ఎదురవడం బాధాకరం
నవతెలంగాణ – కంఠేశ్వర్
వెస్ట్ బెంగాల్లో నీ కలకత్తాలో మెడికల్ విద్యార్థినీ పై జరిగిన హత్యాచారం, హత్యను నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా ప్రభుత్వాసుపత్రి లో జూనియర్ డాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాల్గవ రోజు ఆందోళన శనివారం కొనసాగించారు. ఈ సంద్భంగా భారతదేశ చిత్రపటం గీసి మృతి చెందిన మెడికల్ విద్యార్థిని చిత్రపటాన్ని మెడికల్ విద్యార్థులు అందులో ఆమె చిత్రాన్ని వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాలుగవ రోజు జూడ విద్యార్థులకు నిజాంబాద్ నగరంలో ప్రైవేట్ హాస్పటల్స్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, స్వచ్ఛంద సంస్థలు, తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్లు వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు జూనియర్ డాక్టర్లు మాట్లాడుతూ.. అత్యాచార ఘటన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించాలని దోషులుగా నిర్ధారించబడిన వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. నేడు అనగా శనివారం జిల్లావ్యాప్తంగా ప్రవేట్ ఆసుపత్రుల బంద్ పాటిస్తూ వైద్య సేవలను నిలిపివేయాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగానే బెంగాల్లో మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనను నిరసిస్తూ శనివారం దేశవ్యాప్తంగా వైద్యసేవలు స్వచ్ఛందంగా నిలిపివేశరని తెలిపారు.