నవతెలంగాణ కడప: టాటా గ్రూప్‌కు చెందిన వాల్యూ రిటైల్ ఫాస్ట్ ఫ్యాషన్ చైన్ జూడియో, జెఎస్ షాపింగ్ మాల్‌లో తమ స్టోర్‌ను ప్రారంభించింది. కడప వాసులు ఇప్పుడు తమ సమీపంలోనే సరసమైన ధరల శ్రేణిలో ఫ్యాషన్ దుస్తులు మరియు ఉపకరణాలతో సహా అత్యుత్తమ ఫాస్ట్ ఫ్యాషన్‌ను కొనుగోలు చేయవచ్చు. “ఆంధ్రప్రదేశ్‌లో సమకాలీన ఫ్యాషన్ లకు పెరుగుతున్న డిమాండ్ ను మేము తీరుస్తున్నాము. కడపలోని మా ఈ స్టోర్ రాష్ట్రంతో మా అనుబంధాన్ని బలోపేతం చేసింది. స్టైల్ మరియు సరసమైన ధరలతో మహిళలు, పురుషులు మరియు పిల్లలకు సాటిలేని ధరలకు ఫ్యాషన్‌ని జూడియో అందిస్తోంది’’ అని ట్రెంట్ లిమిటెడ్ సీఈఓ & ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి.వెంకటేశాలు అన్నారు. కడపలోని జూడియో స్టోర్ సరసమైన ఫ్యాషన్ ప్రపంచాన్ని నగరవాసులకు పరిచయం చేసింది. నగరంలోని యువత మరియు విస్తృత శ్రేణి కమ్యూనిటీకి అధునాతనమైన ఇంకా బడ్జెట్-స్నేహపూర్వకమైన పాశ్చాత్య మరియు ఎత్నిక్ దుస్తులు, సాధారణ దుస్తులు, పాదరక్షలు అందిస్తుంది. కడపలో షాపింగ్ గమ్యస్థానంగా జూడియో మారింది. జూడియోకి ఆంధ్రప్రదేశ్‌లో 19 స్టోర్లు ఉన్నాయి. ఇక్కడ కేవలం రూ.149తో మరియు రూ.199తో ప్రారంభమయ్యే పాదరక్షలు లభిస్తాయి. ప్రతి రెండు వారాలకు జూడియో తన స్టాక్‌ను రిఫ్రెష్ చేస్తుంది.