
జిల్లా కోర్టు భవనం లోని కుంచాల సునితా జిల్లా ప్రధాన న్యాయమూర్తి తన చాంబర్ లో బిసి ఉపాధ్యాయ సంఘం వాల్ క్యాలెండర్ ను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కుంచాల సునితా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థినులకు అందరికీ సానిటరీ నాప్కిన్స్ అందేలా చూడాలన్నారు. తనవంతు బాధ్యతగా 4 పాఠశాల లో అందిస్తానని మిగతా దాతలు కూడా స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిసి ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్షి రాఘవాపురం గోపాలకృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ కొట్టాల రామకృష్ణ, గౌరవ అధ్యక్షులు కైరంకొండ బాబు, బిసిటియు మహిళా అధ్యక్షురాలు నునుగొండ విజయలక్ష్మి, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి నర్సయ్య, గౌరవ సలహాదారులు రమణ స్వామి, మాక్లూర్ మండల బిసిటియు అధ్యక్షులు గంగోనె సంజీవ్, రఘువీర్, శివ తదితరులు పాల్గొన్నారు.