
విద్యార్థి దశ నుండే చట్టాలు న్యాయ వ్యవస్థలపై అవగాహన కలిగి ఉండాలని పరకాల కోర్టు జడ్జి శాలిని లింగం అన్నారు. శనివారం ఆత్మకూరు జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటైన న్యాయ విజ్ఞాన సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్జి శాలిని లింగం మాట్లాడుతూ తన విద్యార్థి దశ ఏ విధంగా కొనసాగింది. జడ్జిస్థాయికి రావడానికి తను శ్రమించిన విధానాన్ని విద్యార్థులకు ఆమె వివరించారు. తప్పులు చేసిన వారికి తోడుంటే నేరం తమ మీదికి వస్తుందని తము చేయలేదంటే చట్టం ఊరు కోదని ఆమె ప్రాక్టికల్ గా విద్యార్థులకు అవగాహన కలిగించారు. చెడు వ్యసనాలు కలిగి ఉన్న వారికి దూరంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. చట్టం దృష్టిలో అందరూ సామానులని ప్రణాళిక బద్ధంగా క్రమశిక్షణతో చదువులో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు. పాఠశాలల్లో లైంగిక వేధింపులకు అసభ్య ప్రవర్తన ఎదురైనప్పుడు పాఠశాల ఉపాధ్యాయులకు గాని తల్లిదండ్రులకు గాని తెలియజేసి రక్షణ పొందాలన్నారు. చట్టాలు కఠినంగా ఉన్నాయని తమకు జరిగిన అన్యాయాన్ని భయపడకుండా ఎదుర్కోవాలని విద్యార్థినులకు పిలుపునిచ్చారు. అనంతరం పాఠశాలలో ఇటీవల పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు గూడెంపాడు మాజీ సర్పంచ్ రేమిడి మల్లారెడ్డి ,మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రేమిడి మల్లారెడ్డి విద్యార్థి ఎండి శభాజ్ హమీద్ కు బంగారు పథకం తోపాటు నగదు బహుమతిని అందజేశారు. అలాగే మనోజ్ సాయి తేజ, భవాని లాస్య లకు వెయ్యి రూపాయల చొప్పున నగదు బహుమతిని జడ్జి శాలిని లింగం చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు బందీల స్వామి మాజీ పి పి భాస్కర్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నిర్మల కుమారి, హైకోర్టు ఏ జి పి గట్ల మహిపాల్ రెడ్డి మాజీ జెడ్పిటిసి న్యాయవాది టింగి లి కారి సత్యనారాయణ, న్యాయవాది ఒంటేరు రాజస్వామి మెరుగు శ్రీనివాస్ బారాసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ జంగస్వప్న ఉపాధ్యాయులు ఐత రాజు, సోమయ్య వేమారెడ్డి శ్రీదేవి సమత తదితరులు పాల్గొన్నారు.