నవతెలంగాణ -అమరావతి : స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంకు సంబంధించి తనను అరెస్టు చేసిన సమయంలో ఉన్న సిఐడి అధికారుల కాల్ డేటాను ఇవ్వాలని కోరుతూ … టీడీపీఅధినేత చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై శుక్రవారం విజయవాడలోని ఎసీబీ కోర్టులో వాదోపవాదాలు ముగిశాయి. ఇరువురి తరపు న్యాయవాదుల వాదోపవాదాలను విన్న ధర్మాసనం … తీర్పును రిజర్వ్ చేసింది. కాల్ డేటా అంశంపై ఈనెల 31న తీర్పు ఇవ్వనున్నట్లు ఎసిబి కోర్టు తెలిపింది.