మండలం లోని అమీనాపూర్ గ్రామంలో 35 ఎస్సీ మాల కుటుంబాలను సాంఘీక బహిష్కరన చేసిన గ్రామ వీడిసి మరికొందరు మ్మిది మందికి జ్యూడిషియల్ రిమాండ్ తరలించినట్టు ఏ సి పి జగదీష్ చందర్ గురువారం తెలిపారు . ఈనెల 16వ తేదీ వీడీసీ సభ్యులు, ఇంకా కొందరు వ్యక్తులు 24 మంది పై కేసు నమోదు చేయబడింది మిగిలిన వారు పరారీ లో ఉన్నారని తెలిపారు ఈ సందర్భంగా ఏసీ పి మాట్లాడుతూ. విడీసీలు లు అనేవి చట్టానికి వ్యతిరేకంగా ఏర్పడినవి, జరిమానాలు విధించడం భహిష్కరనలు చేయడం చట్ట రిత్యా నేరము ఇలాంటి చట్టవ్యతిరేకమైన చర్యలు ఎవరు చేసిన వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.