
నవతెలంగాణ – మద్నూర్
జుక్కల్ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులను ఎంపిక చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నియోజకవర్గంలో మొత్తం ఎనిమిది మండలాలు ఉన్నాయి. మద్నూర్ మండల అధ్యక్షులుగా ధరాస్ సాయిలు డోంగ్లి మండల అధ్యక్షునిగా బసవరాజ్ పటేల్ బిచ్కుంద మండల అధ్యక్షునిగా దర్పల్ గంగాధర్, జుక్కల్ మండల అధ్యక్షునిగా మలిపతి సంజయ్ కుమార్, పెద్ద కోటప్గల్ మండల అధ్యక్షునిగా మహేందర్ రెడ్డి, మహమ్మద్ నగర్ మండల అధ్యక్షునిగా రవీందర్ రెడ్డి, పిట్లం మండల అధ్యక్షునిగా సిహెచ్ హనుమాన్లు ఎంపికైనట్లు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ ఎంపిక ఉత్తర్వులు జారీ చేశారు.