ఎడ్యుకేషనల్ హబ్ గా రూపుదిద్దుకోబోతున్న జుక్కల్ నియోజకవర్గం

Jukkal constituency is going to be developed as an educational hubనవతెలంగాణ – మద్నూర్ 
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు జుక్కల్ నియోజకవర్గాన్ని ఎడ్యుకేషనల్ హబ్ గా మార్చేందుకు కృషి చేస్తున్నారు. అందులో భాగంగా బిచ్కుంద ITI కాలేజ్ ను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ గా అప్ గ్రేడ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 25  ITI కళాశాలలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ గా అప్ గ్రేడ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కామారెడ్డి జిల్లాలో కేవలం ఒక్క బిచ్కుంద ITI కళాశాలకు మాత్రమే ఈ అవకాశం రావడం పట్ల ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు  పట్టుదల, కృషి ఎంతగానో ఉంది. ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ గా అప్ గ్రేడ్ చేసిన ITI కళాశాలలో కోర్సులు పూర్తి చేసిన వారికి ఉద్యోగం, ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి పదో తరగతి పాసైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి, పూర్తి వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెం. 986675769