నవతెలంగాణ – మద్నూర్
మూడు రాష్ట్రాలకు పూర్తిగా సరిహద్దు లో గల మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం నాడు జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంతు షిండే ప్రత్యేక పూజలు నిర్వహించారు. జహీరాబాద్ పార్లమెంటు స్థానం నుండి బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గాలి అనిల్ కుమార్ గెలుపు కోసం సలాబత్పూర్ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్లకు విన్నవిస్తూ కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేయాలని, మళ్లీ వస్తున్న కాంగ్రెస్ నాయకుల మాటలకు నమ్మకుండా తమ ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని కోరారు. కేసీఆర్ ఆయంలో జరిగిన అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటు వేసి గాలి అనిల్ కుమార్ కు గెలిపించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే ఇంటింటా ప్రచార కార్యక్రమంలో పలువురు బి ఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.