
తెలంగాణ రాష్ట్రానికి కామారెడ్డి జిల్లా కేంద్రానికి పూర్తిగా మారుమూల ప్రాంతంలోని వెనుకబడ్డ జుక్కల్ నియోజకవర్గాన్ని మొట్టమొదటిసారిగా జుక్కల్ ఎమ్మెల్యేగా గెలుపొందిన తోట లక్ష్మీ కాంతారావు అమెరికాలో జుక్కల్ నియోజకవర్గం పేరును మారుమోగించారు. అమెరికాలో నిర్వహించిన సభలో జుక్కల్ బోర్డ్ ప్రపంచ దేశాల వారికి చూపించడం, ఈ నియోజకవర్గ ప్రజలు వెనుకబడ్డ ప్రాంత జుక్కల్ పేరును అమెరికాలో మోగించిన ఎమ్మెల్యేకు ప్రత్యేకంగా అభినందించారు. ఈ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తున్న ఎమ్మెల్యే పట్ల నియోజకవర్గ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తం అవుతుంది.