ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం జుక్కల్ ఎమ్మెల్యే ప్రచారం 

నవతెలంగాణ – మద్నూర్ 
ఢిల్లీలో ఎలక్షన్స్ సందర్భంగా.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఏఐసీసీ సెక్రటరీ రోహిత్ చౌదరికి మద్దతుగా శుక్రవారం నాడు ఎన్నికల ప్రచారంలో  జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు. ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం జోరుగా సాగుతుందని తెలిపారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలని బలంగా కోరుకుంటున్నారని ఎమ్మెల్యే అన్నారు. అదేవిధంగా రోహిత్ చౌదరి  భారీ మెజారిటీతో విజయం సాధించబోతున్నారని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు వెంట మద్నూర్ సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్ డోంగ్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజు పటేల్ పాల్గొన్నారు.