ఆదివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసం ప్రజాభవన్ లో నల్ల పోచమ్మ అమ్మవారికి నిర్వహించిన బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సతీమణి తోట అర్చన దంపతులు పాల్గొన్నారు. ఈ బోనాల ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, విశిష్ఠ అతిథులుగా రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి లు హాజరయ్యారు. హైదరాబాద్ నగర మేయర్ విజయలక్ష్మి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, నారాయణ పేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాల్గొన్నారు.