రంజాన్ ప్రత్యేక ప్రార్థనలో పాల్గోన్న జుక్కల్ ఎమ్మెల్యే

నవతెలంగాణ – జుక్కల్

మండల కేంద్రం లోని గుండూర్ రోడు వద్ద రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గాలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావ్ స్థానిక ప్రజాప్రతినిధులతో  కలిసి ముస్లింల ప్రత్యేక ప్రార్థనలో గురువారం నాడు పాల్గోన్నారు. ఈ సంధర్భంగా ఎమ్నెలే మాట్లాడుతూ.. నెల రోజుల పాటు ఉపవాస్య దీక్షలు చేసి చంద్రుని వంక చూసి ఉప వాస దీక్షలు వదిలేసి రంజాన్ పండుగను భందు మిత్రులతో కలిసి ఊద్గాలవద్ద ప్రార్థనలు చేసి ఘణంగా నిర్వహిస్తారు. పవిత్ర పండుగ రోజు అంగరు అన్నదమ్ముల్లా మెలగాలని  పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో  ఎమ్మెలే తో పాటు పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ వినోద్, సీనీయక్ నాయకపలు రమేష్ దేశాయి , ఎస్ఎఫ్ఐ మండల అద్యక్షుడు అఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు.