విజయోత్సవ సభలో పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

– ఎమ్మెల్యే సమక్షంలో చేరిన కాటేపల్లి సర్పంచ్
నవతెలంగాణ-పెద్దకొడప్ గల్
మండల కేంద్రానికిఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు బుధువరం నాడు  కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు,యువకులు ప్రజలు బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు.ఎమ్మెల్యే అంబెడ్కర్ గాంధీ విగ్రహలకు పూలమాల వేశారు. అనంతరం  మండల నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం (విజయోత్సవ సభ)లో పాల్గొని ఎమ్మెల్యేలక్ష్మీ  మాట్లాడుతూ.. జుక్కల్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు  ధన్యవాదాలు తెలిపారు.పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ తగిన ఫలితం ఉంటుందని, ప్రతి ఒక్కరినీ గుర్తు పెట్టుకుంటానని అన్నారు.అదేవిధంగా తనపై విశ్వాసంతో ఓట్లు వేసి గెలిపించిన జుక్కల్ ప్రజలకు పాదాభివందనాలు తెలియజేశారు.తనను ఎమ్మెల్యే గా గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటానని భరోసా ఇచ్చారు.నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి ప్రజల  రుణం తీర్చుకుంటానని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే హన్మంత్ షిండే నియోజకవర్గ వర్గాన్ని ఎక్కడ అభివృద్ధి చేసిన దాఖలాలు లేవని ఎద్దవా చేశారు.పెద్ద కొడపగల్ మండలం చాలా వెనకపడిందని, అధికారపార్టీ నాయకులతో ఇక్కడి ప్రతిపక్ష నాయకుడు కుమ్మక్కై వారికి అమ్ముడుపోవడమే కారణమని ఆగ్రహ వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని రోడ్లు, విద్యా, వైద్యం, ఉపాధిపై ప్రత్యేక దృష్టి సారించి పనిచేస్తానని ప్రజలు కూడా అందరూ తమ వంతుగా బాధ్యతతో నియోజకవర్గ అభివృద్ధిలో తనకు సహకరించాలని కోరారు. గుడులతో సమానంగా బడులకు కూడా ప్రాధాన్యత ఇస్తేనే మన పిల్లల భవిష్యత్ బాగుంటుందని ఆయన సూచించారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అన్ని శాఖల ప్రభుత్వ అధికారులతో రివ్యూ మీటింగ్ లు నిర్వహించానని,ఈ మద్యే ప్రభుత్వ కార్యాలయాలను, ఆసుపత్రులను తనిఖీ చేశానని చెప్పారు.. ఏ ఒక్క అధికారి కానీ ఉద్యోగి కానీ సక్రమంగా విధులు నిర్వహించట్లేదని అన్నారు. ఇక నుండి వాళ్ళతో ఎలా పని చేయించాలో తనకు  బాగా తెలుసు అని చెప్పారు.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే రెండు గ్యారెంటీలను అమలు చేశామని,రాబోయే రోజుల్లో ఆరు గ్యారెంటీలను పూర్తిగా అమలు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.అనంతరం మండలానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.వీరికి పార్టీ ఖండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, సొసైటీ డైరెక్టర్ నాగిరెడ్డి, మాజీ సర్పంచ్ ఉప నారాయణ,మోహన్,పండరి, మాణిక్ రెడ్డి, మల్లప్ప పటేల్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు