నవతెలంగాణ-మద్నూర్ : ఈనెల 26న గణతంత్ర వేడుకల్లో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమాల్లో భాగంగా జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు నియోజకవర్గం లో పాల్గొనే కార్యక్రమాల షెడ్యూల్ ఖరారు అయింది ఈనెల 26న ఉదయం 7:30 గంటలకు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ జుక్కల్ లో జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం కౌలాస్ కోటాలో 8 గంటలకు జాతీయ పతాక ఆవిష్కరణ ఆ తర్వాత మద్నూర్ మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో నిర్వహించే జాతీయ పతాక ఆవిష్కరణ వేడుకల్లో 8:45 కు పాల్గొంటారు అనంతరం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించే గణతంత్ర వేడుకల్లో 9 45 నిమిషాలకు పాల్గొంటారని సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాదులో గవర్నర్ తేనేటి విందుకు హాజరవుతారని పేర్కొన్నారు