నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలకేంద్రంలో గత పన్నెండు రోజులుగా జీపీ కార్మీకులు న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతు సమ్మే చేస్తుంటడంతో గ్రామాపంచాయతి విధులలో చెత్తనిండి పోయి వర్షం వలన కంపుకొడుతుండం వలన ఇబ్బందులు పడుతున్న గ్రామప్రజలకు సమస్యను పరిష్కరించేందుకు సర్పంచ్ బొంపెలి రాములు ఆధ్వర్యంలో చెత్తను తొలగించెందుతు నిర్ణయించి మంగళవారం రోజు జీపీ ట్రాక్టర్ లో చెత్తను నింపి డంపింగ్ యార్డ్ కు తరలించారు. గ్రామస్తులు కూడా సర్పంచ్ చేస్తున్న కృషి తాము కూడా సహకరించి తాముకూడా స్వచ్చందంగా పాల్గోంటామని తెలిపారు. మండలంలో సర్పంచ్ ఆదర్శంగా నిలుస్తున్నారు. చెత్త తొలగింపు కార్సక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్జు సబ్యులు అయిల్ వార్ శకుంతల, హన్మవ్వ, సవిత, రమేష్, రాజు, నాగ్ నాథ్, సునిత, కాశీరాం జీపీ సిబ్బంది మనోజ్ తదితరులు పాల్గోన్నారు.