నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ మండలం మందోల్లగూడెం గ్రామానికి బోరెం జనార్దన్ రెడ్డి 28వ వర్ధంతి మహాసభకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, యాదాద్రిభువనగిరి జిల్లా కార్యదర్శి ఎండి జాంగీర్ శనివారం రానున్నారని సీపీఐ(ఎం) మండల నాయకులు కొండే శ్రీశైలం తెలిపారు. బోరెం జనార్దన్ రెడ్డి ఈ ప్రాంత ప్రజలకు సేవలను కొనియాడుతూ మందోళ్లగూడెం కందగట్ల ఎల్లయ్య తోటలో సంస్మరణ సభ అనంతరం 11వ గ్రామ శాఖ మహాసభ జరుగుతుందని, మహాసభకు వచ్చే క్రియాశీల నాయకులు, కార్యకర్తలు, రెడ్ షర్ట్ ధరించి రావాలని కొండే శ్రీశైలం తెలిపారు.