చౌటుప్పల్ మండలం మందోల్లగూడెం గ్రామంలో బొరేం జనార్దన్ రెడ్డి 28వ వర్ధంతి మహాసభ శనివారం ఘనంగా నిర్వహించారు. అనంతరం మందోల్లగూడెం ఉమ్మడి 11వ మహాసభ ముఖ్యఅతిథిగా విచ్చేసిన సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ గజ్వేల్ నుండి చౌటుప్పల్ పై నుండి వెళుతున్న రీజినల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ ను తక్షణమే మార్చాలని సీపీఐ(ఎం) పక్షాన డిమాండ్ చేస్తుందని పేర్కొన్నారు. మందోల్లగూడెం గ్రామంలో శనివారం 11వ ఉమ్మడి గ్రామ మహాసభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ 10 గుంటల నుండి ఎకరం లోపు భూములను కోల్పోతున్న చౌటుప్పల్ పరిసర ప్రాంత రైతుల కొరకు తక్షణమే అలైన్మెంట్ ను మార్చాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అలైట్మెంట్ ను మారుస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీ మాట తప్పిందని దుయ్యబెట్టారు. అలైన్మెంట్ మార్చకపోతే ఎకరానికి మూడు కోట్లు చొప్పున నష్టపరిహారం కింద రైతులకు అందజేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడుస్తున్న ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని రంగన్న పేర్కొన్నారు. రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు రుణమాఫీ చేయక కొత్త రుణాలు బ్యాంకులు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ విధానాలు ఈ విధంగానే కొనసాగితే రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన సీపీఐ(ఎం) ప్రజా ఉద్యమాలు చేయబోతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు బొంతల చంద్రారెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దోనూరి నర్సిరెడ్డి సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి, ఎండి పాషా, చౌటుప్పల్ మండల కార్యదర్శి గంగాదేవి, సైదులు, చిన్న కొండూరు మాజీ ఎంపీటీసీ చిన్నబోయిన వెంకటేశం, మండల కమిటీ నాయకులు రాగిరి కిష్టయ్య, తడక మోహన్, బొజ్జ బాలయ్య, కొండే శ్రీశైలం, బోరెం నర్సిరెడ్డి, సప్పిడి లక్ష్మారెడ్డి, యాట బాలరాజు, చింతల సుదర్శన్, నందీశ్వర్, లెనిన్ రెడ్డి, ముత్యాలు, స్వరాజ్యం, కలమ్మ, మాజీ సర్పంచ్ బూరుగు చంద్రకళ, శ్రీనివాస్ రెడ్డి, మహేందర్ రెడ్డి, నాయకులు, పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.