జంప్‌ జిలానీలు

– పార్టీలు మారుతున్న ప్రజాప్రతినిధులు, నాయకులు
– ఎన్నికల తాయిలాల కోసమేనా పార్టీల మార్పు
– అదేదారిలో వివిధ పార్టీల నాయకులు
– నాయకుల అవసరాల కోసమే పార్టీల మార్పు అంటున్న రాజకీయ నిపుణులు
నవతెలంగాణ-తాండూరు
ఎన్నికల సమయంలో పార్టీలు మార్పులు వ్యక్తి అభి వద్ధి కోసమా గ్రామ ప్రాంత వార్డుల అభివద్ధి కోసమా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. తాండూరు నియోజ కవర్గంలో ఎన్నికల సమయంలో పలువురు నాయకులు ప్రజాప్రతినిధులు పార్టీలు మారడం సర్వసాధనమైంది. ఎ న్నికల సమయంలో ప్రజా ప్రతినిధులు నాయకులు ఎన్ని కల తాయిలాల కోసమే పార్టీలు మారుతున్నట్లు పలువు రు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో పార్టీల మార్పు వ్యక్తుల లాభం కోసం తప్ప ప్రాంతా అభి వద్ధి మాత్రం ఏమాత్రం ఉండదని పలువురు అభిప్రా యాలు వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులు ఒక నాయకుని దగ్గర అన్ని విధాలుగా లబ్ధి పొందిన నాయకులు కూడా ఎన్నికల తాయిలాల కోసమే పార్టీలు మారుతున్నట్లు పలువురు విమర్శిస్తున్నారు. ఇదివరకు అధికార పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులు నాయకులు ఎన్నికల సమయంలో పార్టీలు మారడం పట్ల అంతర్యం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీపై ఏనాడు అసమ్మతి తెలి యజేయని నాయకులు నేరుగా పార్టీలు మారడం పట్ల పలు అనుమానాలకు దారితీస్తున్నాయి. ఎన్నికల సమ యంలో నాయకులను ఇబ్బందుల గురి చేసేందుకే కొం దరు నాయకులు ప్రజాప్రతినిధులు ఎన్నికల తాయిలాల కోసమే తప్ప పార్టీల మార్పు ప్రాంత అభివద్ధి కానీ ఇతరు ల అభివద్ధి కానీ సంఘాల అభివద్ధి కానీ జరగదని పలు వురు పలువురు అభిప్రాయాలు చేస్తున్నారు. తాండూరు నియోజకవర్గంలో ఎన్ని రోజులు అధికారం పార్టీలో ఉండి అన్ని రకాల లబ్ది ఉంది ఎన్నికల సమయంలో వ్యక్తిగత లా భాల కోసమే పార్టీలు మారుతున్నట్లు అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నియోజవర్గంలో వివిధ మండలాల కు చెందిన సర్పంచులు ప్రజాప్రతినిధులు పార్టీల నాయకులు మారడం సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. పార్టీలు మారుతున్న ప్రజాప్రతినిధులు తమ ప్రాం తాలకు ఏమి అభివద్ధి జరుగుతుందో చెప్పాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాండూరు నియోజక వర్గంలో బీఆర్‌ఎస్‌ పార్టీ నుండి కాంగ్రెస్‌లోకి కాంగ్రెస్‌ నుండి బీఆర్‌ఎస్‌ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. నియోజకవర్గంలో ప్యాకేజీల పర్వం కోసం నాయకులు ప్రజాప్రతినిధులు ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. అధికా ర పార్టీకి చెందిన నాయకులు ప్రజ ప్రతినిధులు పార్టీ మారే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఎన్నికలు దగ్గర వస్తున్న కొద్ది నాయకుల కప్పదాట్లు అధికమవుతున్నాయి. ఎన్నికలు వచ్చేవరకు ఎంతమంది ఏ పార్టీలో వెళతారో ఏ పార్టీలో ఉంటారో వేచి చూడాలి.