నవతెలంగాణ – మోపాల్
రాజకీయాలంటే రోజురోజుకీ నీచంగా తయారవుతున్నాయి. ముఖ్యంగా మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి మరింత అద్వానంగా ఉంది. పార్టీ ఫిరాయింపులు ఎక్కువవుతున్నాయి, ప్రథమ స్త్రీని నాయకుల కంటే మరీ దారుణంగా శ్రేణి నాయకులు తయారవుతున్నారు. అధికారం కోల్పోయి నెలరోజులు గడవకముందే ఇతర పార్టీలోకి వలసలు ప్రారంభమవుతున్నాయి. అధికారంలో ఉన్నన్ని రోజులు రాజభోగాల అనుభవించి పార్టీ ఎలక్షన్ లో ఓడిపోయిన వెంటనే అధికారంలోకి వచ్చిన పార్టీలో వలసలుగా వెళ్తున్నారు. పార్టీ నీ కష్ట కాలంలో ఉన్నప్పుడు ఆదుకునే దేవుడెరుగు కనీసం పార్టీ వైపు కన్నీటి కూడా చూడడం లేదు. కారంలో ఉన్నన్ని రోజులు తమ అధికార పార్టీ వాళ్ళం అని ఉర్రవీగుతూ ప్రభుత్వ ఆఫీసుల్లో పెత్తనం చెల్లాయించేవారు ఏ సంక్షేమ పథకాలు వచ్చినా కూడా ముందు వరుసలో వారే ఉండేవారు, అద్ది పొందిన వాళ్లలో చాలామంది అధికారం కోల్పోయిన వెంటనే ఇతర పార్టీలో చేరి మళ్లీ అక్కడ కూడా వారి పెత్తనమే సాగేటట్టు చూస్తున్నారు. పోనీ వాటిలో చేరిన వెంటనే సైలెంట్ గా ఉండకుండా అక్కడ కష్టపడ్డ వారిని పక్కకు నెట్టేసి ఆ పార్టీ అధికారం రావడం కోసం అక్కడ పార్టీలో ఉన్న కార్యకర్తలు అందరూ రాత్రింబవలు కష్టపడి తమ పార్టీ అధికారంలోకి వస్తే తమదే రాజ్యం అనుకుంటే వాళ్ళని తొక్కి పెట్టి ఈ పార్టీ ఫిరాయింపు దారిలు పెత్తనం చేలాయిస్తున్నారు .ఈ విధంగా చూసుకుంటూ పోతే నిజమైన కార్యకర్తకు గుర్తింపు ఉండటం లేదు కనీసం వారికి మర్యాద కూడా దొరకడం లేదు. గెలిచిన ఎమ్మెల్యేలు సైతం వారిని నిర్లక్ష్యం చేస్తున్నారు. వారి గోస మాటల్లో వర్ణించలేని విధంగా ఉంది. దానికి తోడు గెలిచిన ఎమ్మెల్యే మా కులం వాడే అని మత రాజకీయాల కంటే కుల రాజకీయాలు ఎక్కువవుతున్నాయి కష్టపడ్డ వారికి తమ ఎమ్మెల్యే గెలిపించిన వారికి సమయం ఇవ్వని కొందరు నాయకులు. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి అధిక ప్రాధాన్యతిస్తున్నారని బహిరంగ రహస్యం. “సొమ్మొకడిది సోకొకడిది “అనే విధంగా తయారైన ఈ నేటి రాజకీయాలు.. ఎలక్షన్ సమయంలో రాత్రింబవళ్లు కష్టపడి తమ సొంత డబ్బులను కూడా ఖర్చు పెట్టుకుని తమ నాయకుని గెలిపిస్తే చివరికి ఆ నాయకుడే తమను పట్టించుకోకపోతే వారి పరిస్థితి అగమ్య గోచరంగా తయారవుతుంది. కొందరు పార్టీ గుర్తుపైన గెలిచి కూడా తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దినట్టు ఆ పార్టీ నే వదిలేస్తున్నారు పార్టీ ఫిరాయింపులను కఠిన తరం చేయకుంటే పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు తీవ్రంగా అన్యాయం చేసిన వారు అవుతారు. కనీసం వారు ఒక నెల రోజులు కూడా ప్రతిపక్షంలో ఉండేందుకు ఇష్టపడటం లేదు అంటే అటువంటి మహానుభావులు ఎంత నీచ రాజకీయాలకు ఒడిగడుతున్నారు అటువంటి వారిని అర్థం చేసుకోవాలి. కనీసం అధికారపక్షం వారైనా వారిని దూరం పెట్టాలి లేకపోతే మళ్ళీ ఈ అధికారపక్షం కూడా ఏదో ఒకరోజు ప్రతిపక్షం పోక తప్పదు అటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి అధికారపక్షంలోకి వెళ్తారు. ఇటువంటి నమ్మకద్రోహులను ఎన్ని రోజుల పక్కన ఉండా కూడా తిన్నింటి వాసాలు లెక్క పెట్టే విధంగా ఉంటారే తప్ప పార్టీ కోసం నాయకుడు కోసం కష్టపడే వ్యక్తులు మాత్రం కాదు. కేవలం వాళ్ళ సొంత ప్రయోజనాలు మరియు ధనార్జన ధ్యేయంగా మాత్రం పార్టీ ఫిరాయింపులు చేస్తూ ఉంటారు. ప్రజలు కూడా నమ్మకుండా తయారవుతారు ఇటువంటి నాయకులను చూసి నాయకులతో పాటు ఆ పార్టీ కూడా చెడ్డ పేరు వస్తుంది కొందరైతే కొన్ని నియోజకవర్గాల్లో, ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత రోజునే గెలిచిన నాయకుడి ఫ్లెక్సీలో వీరి ఫోటోలే ముందు పెట్టి మరి గ్రామ సెంటర్లలో వారి ఫ్లెక్సీలను పెడుతున్నారు. గ్రామస్తులు చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇంత నీచంగా కూడా ఉంటారా అని, అందుకే ఇప్పటికైనా అధికారపక్షం వాళ్ళు ఎవరు పార్టీ కోసం కష్టపడ్డారు ఎవరు సైనికుల్లా పార్టీకి అధికారంలోకి వచ్చే విధంగా చూశారో వారికి మాత్రమే స్థానిక పదవుల్లో కానీ మరియు నామినేటెడ్ పోస్టుల్లో కానీ పెద్దపీట వేయాలని కొందరు కార్యకర్తలు తన మనోగదాన్ని వివరిస్తున్నారు. అలా చేసినప్పుడే నిజమైన కార్యకర్తకు న్యాయం జరుగుతుంది సంవత్సరాల నుండి పార్టీ కోసం కష్టపడ్డ వారికి పార్టీలో గుర్తింపు ఉంటుందని నమ్మకం కుదురుతుంది.