అంజన్నకు మొక్కు తీర్చుకున్న ఆది శ్రీనివాస్ అభిమాని జూనియర్ బిత్తిరి సత్తి`

– వేములవాడ నుండి కొండగట్టుకు కాలినడకన పాదయాత్ర ..
నవతెలంగాణ – వేములవాడ
అసెంబ్లీ ఎన్నికల్లో వేములవాడ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఆది శ్రీనివాస్ ఘన విజయం సాధించాలని ఆయన అభిమాని తౌటు సాయి అలియాస్ జూనియర్ బిత్తిరి సత్తి కొండగట్టు ఆంజనేయస్వామికి పాదయాత్రగా వస్తానని మొక్కుకున్నాడు. రెండు రోజుల క్రితం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన అభిమాని జూనియర్ బిత్తిరి సత్తి సాయి వేములవాడ నుండి కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం వరకు పాదయాత్రగా వెళ్లి స్వామి వారికి మొక్కును చెల్లించుకున్నారు.ఆంజనేయస్వామి ఆశీర్వాదంతో ఆది శ్రీనివాస్ కు మంత్రి పదవి రావాలని వేడుకున్నారు.పాదయాత్రకు ముందు వేములవాడ రాజన్న ఆలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం జూనియర్ బిత్తిరి సత్తిని నాయకులు అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.తన పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేయాలని కోరుకున్నారు.పాదయాత్రలో భాగంగా వట్టెంల గ్రామంలో పార్టీ సీనియర్ నాయకుడు రంగు వెంకటేష్ అధ్వర్యంలో నాయకులు జూనియర్ బిత్తిరి సత్తి సాయిని శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్,ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్, రాష్ట్ర మహిళా కార్యదర్శి పాత సత్యలక్ష్మి, దూలం భూమేష్ గౌడ్, బైరి సతీష్, గుర్రం తిరుపతి, సిరిగిరి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.