అటవీ క్షేత్రాన్ని పరిశీలించిన లక్షట్ పేట జూనియర్ సివిల్ జడ్జ్.

నవతెలంగాణ – జన్నారం
జన్నారం మండలంలోని కవ్వాల్ అభయారణ్య అటవీ క్షేత్రాన్ని లక్షట్ పేట కోర్టు  జూనియర్ సివిల్ జడ్జ్ మహమ్మద్ ఆసదుల్లా షరీఫ్  పరిశీలించారు. సోమవారం ఆయన జన్నారం మండలంలోని అడవిలో ఉన్న   గోండుగూడా, బైసన్ కుంట నీళ్ గాయకుంట మహమ్మదాబాద్ అలీ నగర్ వాచ్ టవర్, అటవీ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా అడవి, వన్యప్రాణుల రక్షణకు అటవీ అధికారులు తీసుకుంటున్న చర్యల గురించి తెలుసుకున్నారు. అలాగే అటవీ అధికారులను, సిబ్బందిని ఆయన అభినందించారు. కార్యక్రమంలో జన్నారం ఇన్చార్జి ఎఫ్ఆర్ఓ సుష్మారావు బీట్ ఆఫీసర్ శ్రీనివాస్ ఉన్నారు.