జూనో జనరల్ ఇన్సూరెన్స్ తన ‘టాకింగ్ జీబ్రా’ ప్రచారముతో రోడ్డు భద్రతకు జీవం

Juno General Insurance brings road safety to life with its 'Talking Zebra' campaignహైదరాబాదు: ఇదివరకు ఎడెల్విస్ జనరల్ ఇన్సూరెన్స్ అని పిలువబడిన జూనో జనరల్ ఇన్సూరెన్స్, కొత్త-తరం డిజిటల్ ఇన్సూరర్, ట్రాఫిక్ నియమాలను అనుసరించడము యొక్క ప్రాముఖ్యతను గురించి వాహనదారులు మరియు పాదచారులకు అవగాహన కలిగించటానికి, ఒక ఆకర్షణీయమైన మరియు మరపురాని విధానములో ‘ది టాకింగ్ జీబ్రా’ అనే ఒక ప్రత్యేక రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది. జనవరి 16 నుండి జనవరి 25 వరకు జరిగే ఈ కార్యక్రమము సురక్షితమైన రోడ్ల కొరకు బాధ్యతాయుతమైన డ్రైవింగ్ అలవాట్లను ప్రోత్సహించుటకు జూనో జనరల్ ఇన్సూరెన్స్ యొక్క నిబద్ధతలో భాగము మరియు ఇది రోడ్డు రవాణా మరియు జనవరి నెలను రోడ్డు భద్రత నెలగా రహదారుల మంత్రిత్వశాఖ (ఎంఓఆర్‎టిహెచ్) ప్రకటనకు అనుగుణంగా ఉంటుంది. టాకింగ్ జీబ్రా ప్రచారము ద్వారా, రోడ్డు ప్రమాదాలను తగ్గించుట  బాధ్యతాయుతమైన రోడ్డు వినియోగ సంస్కృతిని పెంచుటపై జాతీయ దృష్టిని విస్తరించటం జూనో లక్ష్యము. ది టాకింగ్ జీబ్రా ప్రచారము వినూత్నమైన ఏకైక కార్యక్రమము. ఇందులో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద జీవము పోసుకున్న ఒక చమత్కారమైన  పరస్పరం స్పందించే ఒక జీబ్రా ఉంటుంది. ప్రచారములో భాగంగా, జీబ్రా మాదిరిగా వేషము వేసుకున్న ఒక ప్రమోటర్ – జీబ్రా క్రాసింగ్స్ యొక్క స్వరూపం – రద్దీ ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ప్రజలతో ఇంటరాక్ట్ అవుతాడు. ఆరు ప్రధాన నగరాలు – ముంబై, గోవా, కోల్‎కత్తా, ఢిల్లీ, హైదరాబాదు, బెంగళూరులలో ఈ మస్కట్, రోడ్డు భద్రత అనేది ప్రతి ఒక్కరు మాట్లాడాలని అనుకునే నిజమైన ఆందోళన ఉన్న ఒక శీర్షికగా చేయటానికి చమత్కారంగా  హాస్యభరితంగా డ్రైవర్లు  పాదచారులతో ఇంటరాక్ట్ అవుతారు. ది టాకింగ్ జీబ్రా, జీబ్రా క్రాసింగ్స్ ను గౌరవించడం, రెడ్ లైట్ వద్ద ఆగడం జైవాకింగ్ నివారించడం వంటి ఆవశ్యక ఆచరణలను ప్రోత్సహిస్తూ ‘కీప్ యువర్ కూల్, ఫాలో ట్రాఫిక్ రూల్స్’ అని ప్రతి ఒక్కరికి గుర్తుచేస్తుంది.
షనాయ్ ఘోష్, ఎండి & సిఈఓ, జూనో జనరల్ ఇన్సూరెన్స్ ఇలా అన్నారు, “రోడ్డు భద్రత అనేది కీలకమైనది పంచుకునే బాధ్యత మరియు జూనో వద్ద మేము నిలిచిపోయే, సానుకూల మార్పును సృష్టించే కార్యక్రమాలను ప్రారంభించుటకు అంకితభావం కలిగి ఉన్నాము.  ప్రతి సంవత్సరం, భారతదేశములో అధిక సంఖ్యలో పాదచారులు ప్రమాదాలకు గురి అవుతున్నారు, ఇవి తరచూ ట్రాఫిక్ నియమాలు  జీబ్రా క్రాసింగ్స్ ను నిర్లక్ష్యం చేసే డ్రైవర్ల వలన సంభవిస్తూ ఉన్నాయి. కోల్‎కత్తా కూడా గత అయిదు సంవత్సరాలలో ప్రమాదాలలో సుమారు 15% పెరుగుదలను చూసింది, భారీ ట్రాఫిక్, ట్రాఫిక్ నిబంధనలకు కట్టుబడి ఉండకపోవడం  సరిపోని జీబ్రా క్రాసింగ్స్ వంటి భద్రతా చర్యల అమలు మొదలైన కారణాల వలన పాదచారుల భద్రత ఒక ప్రధాన ఆందోళనగా నిలిచింది. టిఆర్‎ఐపి సెంటర్, ఐఐటి ఢిల్లీ ద్వారా అందించబడిన ‘ఇండియా స్టేటస్ రిపోర్ట్ ఆన్ రోడ్ సేఫ్టీ 2024’ రోడ్డు ప్రమాద మరణాలను తగ్గించడములో భారతదేశం చూపించే నెమ్మదైన పురోగతిని ప్రాధాన్యీకరిస్తుంది. ఇతర రంగాలలో పురోగతులు ఉన్నప్పటికీ, రోడ్డు ట్రాఫిక్ గాయాలు ప్రధాన ప్రజా ఆరోగ్య సమస్యగానే ఉంది  చాలా రాష్ట్రాలు 2030నాటికి ట్రాఫిక్ మరణాల సంఖ్యను సగానికి తగ్గించాలనే యూఎన్ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చలేకపోతున్నాయి. స్వీడెన్ వంటి రోడ్డు భద్రతా నాయకులతో భారతదేశాన్ని పోలిస్తే, 1990లో ఒక భారతీయుడు రోడ్డు ప్రమాదములో మరణించే అవకాశం 40% ఉండగా, 2021 నాటికి ఆ అంకె 600% కి పెరిగింది అని ఆ రిపోర్ట్ చూపింది. (2022) వరకు అందుబాటులో ఉన్న భారతదేశములో రోడ్డు ప్రమాదాలపై వార్షిక నివేదిక 4,61,312 క్రాషెస్ ను రికార్డ్ చేసింది, ఇది గత అయిదు సంవత్సరాలలో 1% నామమాత్రపు తగ్గుదల, ఇది 1, 68, 491 మరణాలు  4, 43, 366 గాయాలకు దారితీసింది. సగటున, భారతదేశములో గంటకు 53 క్రాషెస్ మరియు 92 మరణాలు చవిచూస్తోంది. ప్రపంచవ్యాప్త డేటా ప్రకారం, భారతదేశములో ప్రపంచములోనే అత్యధిక సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరిగాయి.
కేతన్ మన్‎కీకర్, హెడ్ & విపి మార్కెటింగ్ కమ్యూనికేషన్స్, జూనో జనరల్ ఇన్సూరెన్స్ ఇలా అన్నారు, “ది టాకింగ్ జీబ్రా కేవలం ఒక ప్రచారం మాత్రమే కాదు; ఇది ఒక సంభాషణ స్టార్టర్, ఇది ట్రాఫిక్ నియమాలు అనుసరించాలని రోడ్లను మరింత సురక్షితం చేయాలని ప్రతి ఒక్కరికి ప్రేరణ కలిగించే ఒక ఉద్యమం. ఈ ప్రచారము డ్రైవర్లు,  నడిచేవారికి వర్తించే వినూత్నమైన  సృజనాత్మకమైన శీర్షికలను ప్రవేశపెట్టడం ద్వారా పాదచారుల భద్రతా సమస్యలను పరిష్కరిస్తుంది. ప్రచారము యొక్క ఉనికి  ప్రభావాన్ని పెంచుటకు ‘ది టాకింగ్ జీబ్రా’ యొక్క కంఠస్వరాన్ని వాయుతరంగాలలో ప్రతిధ్వనించేలా చేయుటకు జూనో జనరల్ ఇన్సూరెన్స్ ప్రముఖ రేడియో ఛానల్ రెడ్ ఎఫ్‎ఎంతో చేతులు కలిపింది. జూనో జనరల్ ఇన్సూరెన్స్ ప్రచారాన్ని ప్రజలలోకి తీసుకెళ్ళి #TalkingZebra, #RespectTheStripes,  #StayCoolFollowRules. అనే హ్యాష్‎టాగ్స్ తో సోషల్ మీడియా పై ఈ ఉద్యమములో చేరుటకు వారిని ప్రోత్సహించింది. ది టాకింగ్ జీబ్రా ఉద్యమములో చేరాలని  ట్రాఫిక్ నియమాలను అనుసరిస్తామని ప్రతిజ్ఞ చేయాలని జూనో జనరల్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తోంది. కలిసి మనం స్ట్రైప్స్ ను గౌరవిద్దాము, సురక్షితంగా ఉందాము మరియు మన రోడ్లను అందరికి మెరుగైన స్థలాలుగా చేద్దాము.