పరిశ్రమలో ప్రమాదవశాత్తు గాయాలు పాలై ఒక చేతిని కోల్పోయిన క్షతగాత్రుడు ని కాంగ్రెస్ నాయకులు జూపల్లి రమేష్ శుక్రవారం పరామర్శించారు. నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట మండల,పేరాయి గూడెం పేరాయిగూడెం పంచాయతీ లో నివాసం ఉంటున్న తగరం వెంకటేశ్వరావు అశ్వారావుపేట పామ్ ఆయిల్ ప్యాక్టరీ లో పని చేస్తుండగా ఇటీవ ప్రమాదవశాత్తు యంత్రం లో చేయి పడి తీవ్రగాయాలు పాలయ్యాడు.స్పందించిన పరిశ్రమ యాజమాన్యం హుటాహుటిన హైద్రాబాద్ తరలించి శస్త్ర చికిత్స చేయించారు.ఇందులో వెంకటేశ్వరరావు కుడి చేయి మణికట్టు వరకు తొలగించారు. ప్రస్తుతం ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు.ఈ విషయం తెలుసుకున్న స్థానిక కాంగ్రెస్ సీనియర్ నాయకులు జూపల్లి రమేష్ బాతదితుడు వెంకటేశ్వరరావు పరామర్శించి,సంఘటన జరిగిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక ఎంపీటీసీ మిండా హరిబాబు,జూపల్లి ప్రమోద్,నండ్రు రమేష్, సూరి నేని బాబ్జి,నార్లపాటి దివాకర్,నార్లపాటి బుచ్చిబాబు,తగరం ముత్తయ్య,గడ్డం ప్రవీణ్,తడికమల్ల శ్రీను,హేమంత్,సురినేని ఫణి నాగు, కంచర్ల బాబీ, తదితరులు పాల్గొన్నారు.