
బొమ్మలరామరం మండల కేంద్రంలో బుధవారం రజక సంఘం ఆధ్వర్యంలో నూతన కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు.మండలంలోని చీకటిమామిడి గ్రామానికి చెందిన జూపల్లి శ్రీకాంత్ రజక సంఘ నూతన అధ్యక్షులుగా,తిమ్మాపూర్ గ్రామానికి చెందిన తునికి మహేష్ ఉపాధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శి జూపల్లి భరత్ ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలలో కులవృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న రజక కుటుంబాలు అద్వాన స్థితిలో ఉన్నాయని రజక కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే తెలంగాణ ప్రభుత్వం తక్షణమే రజక సంఘాలకు నిధులు కేటాయించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో రజక సంఘ సభ్యులు పాల్గొన్నారు.