విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సు…

నవతెలంగాణ  – భువనగిరి
జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు సూచనల మేరకు, సంస్థ కార్యదర్శి వి. మాధవిలత ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని, విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సును మంగళవారం నిర్వహించారు. కార్యక్రమంలో న్యాయమూర్తి బాల్య వివాహల నిషేధం, బాలకార్మిక నిర్మూలన, బాలలకు రాజ్యాంగ ప్రకారం ఉన్న హక్కులు, బాల బాలికలకు ఏర్పాటు చేసిన జాతీయ న్యాయ సేవ పథకం అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ రెడ్డి, ఉపాధ్యాయులు, పారా లీగల్ వాలంటీర్ రాంబాయి, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.