సర్వే చేసినంత మాత్రాన ప్రాజెక్టు నిర్మించినట్టు కాదు

Just surveying does not mean that the project is built– పై అధికారులకు పంపడానికే ఈ సర్వే రిపోర్ట్‌
– ఎవరూ అధైర్యపడొద్దు : ఆర్డీఓ
నవతెలంగాణ-నేరడిగొండ
మండలంలోని కుప్టి గ్రామంలో హైడల్‌ ప్రాజెక్ట్‌ స్థలాన్ని సర్వే చేయనీయకుండా అధికారులను గ్రామస్తులు అడ్డుకుంటున్నారని ఆర్డీఓ వినోద్‌ అన్నారు. మంగళవారం ఆయన కుప్టి, కుమారి గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా కుమారి గ్రామంలో కుప్టి హైడల్‌ బ్రిడ్జ్‌కు సంబంధించి గ్రామస్తులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆర్డీఓతో వారి సమస్యలను వివరించారు, గ్రామస్తులు కుప్టి హైడల్‌ ప్రాజెక్టు చేయడానికి సర్వే చేస్తున్నారని సర్వే చేసిన తర్వాత మాకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తారని అలా చేయడం వల్ల బ్రతుకుతెరువును కోల్పోతామని సర్వే నిర్వహించిన తర్వాత ప్రభుత్వం వారికి నచ్చిన విధంగా మాకు ప్రాజెక్టు ప్రాంతంలో ఉన్న భూములకు స్థలాలకు నిధులు చెల్లించి మిగతా చుట్టుపక్కల ఉన్న భూములను పట్టించుకోకపోతే మా పరిస్థితి ఏంటి, అంతేకాకుండా మాకు కనీసం గిట్టుబాటు ధర అయ్యే విధంగా అయినా నిధులు ఇచ్చినట్లయితే మాకు వేరే ప్రాంతంలో వ్యవసాయ భూములను గాని తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది, అంతేకాకుండా ఇండ్ల స్థలాల కోసం ప్రాజెక్టు ప్రాంతంలో ఉన్న గ్రామాల వాసులకు ఇండ్ల స్థలాలు కేటాయిస్తే బాగుంటదన్నారు. పునరావాసం కల్పించిన తర్వాత అప్పుడు మీ పనులు ప్రారంభిస్తే బాగుంటుందన్నారు, కానీ పునారవాసం కల్పించకుండా ఉన్న పంట పొలాలను కోల్పోయి అంధకారంలో మాత్రం పారివేయొద్దని గ్రామస్తులు కోరారు. ఈ సందర్భంగా, ఆర్డీఓ వినోద్‌ మాట్లాడుతూ మీరు ఎటువంటి అధైర్య పడవద్దు అని ఇప్పుడు నిర్వహిస్తున్న సర్వే ఎన్ని ఎకరాల భూమి ప్రాజెక్టు నిర్మాణంలో పోతుందని నిర్ధారించడానికి మాత్రమేనని అంతకుమించి మీకు తెలియకుండా ఈ సర్వే నిర్వహించి ప్రాజెక్టు నిర్మించడానికి కాదని మీరు అధైర్య పడవద్దని అన్నారు, ప్రభుత్వం ప్రజలకు అండగానే ఉంటుందని ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా ఎటువంటి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోదని అన్నారు. గ్రామస్తులు ప్రాజెక్టుకు ఎన్ని ఎకరాలైతే అవసరము అంతవరకే తీసుకుంటాము అంటే చుట్టుపక్కల తలో ఎకరం రెండెకరాలు మిగిలిపోతే ఆ వ్యవసాయ భూమిని చేసుకోవడం ఎలా అని ఆర్డిఓ మోహన్‌తో గ్రామస్తులు అన్నారు. అలా అయితే మేము వ్యవసాయ భూములను ఇవ్వడానికి ఒప్పుకోమని అన్నారు, ఒకవేళ మిగిలిపోయినట్టు అయితే ఆ భూమి కోసం మళ్లీ ఆ ప్రాజెక్టును దాటుకుని ఎలా రావాలి మళ్లీ ఇలా వ్యవసాయం చేసుకోవాలి లేకపోతే ప్రాజెక్టు నిండిపోయి మిగిలి ఉన్న వ్యవసాయ భూమిలోకి నీరు చేరిపోతుంది, అప్పుడు మా పరిస్థితి ఏంటి అంటూ గ్రామస్తులు వాపోయారు, గ్రామస్తులు అడిగిన దానికి బదులుగా మిగిలిన వ్యవసాయ భూమిని దృష్టిలోకి తీసుకొని కలెక్టర్‌తో చర్చించి ఏదైనా ఆలోచనకు వస్తామని ఆర్డిఓ గ్రామస్తులకు హామీ ఇచ్చారు, ఈ కార్యక్రమంలో, ఈఈ, డీఈఓ భీమ్‌రావు, తహసీల్ధార్‌ కలీం, ఆర్‌ఐ నాగోరావు, గ్రామస్తులు భీమ్‌ రెడ్డి, చంద్రశేఖర్‌, మందుల రమేష్‌, గ్రామస్తులు పాల్గొన్నారు.