అన్ని వర్గాలకు న్యాయం కాంగ్రెస్ తోనే …గడప గడపకు ప్రచారం

నవతెలంగాణ-ఆర్మూర్ : గ్రామ గ్రామాన గతంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ దేనని, అన్ని వర్గాలకు సమన్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రొద్దుటూరు వినయ్ రెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలోని 11వ వార్డులో మంగళవారం ఎన్నికల్లో భాగంగా ప్రచారం నిర్వహించారు. టిఆర్ఎస్ పాలనలో ఉద్యోగం ఉపాధి లేక ఎంతోమంది యువత ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటు వజ్రాయుధంతో సమానమని, ఓటును సరైన విధంగా ఉపయోగిస్తూ అరాచక పాలనను అంతమొందించాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీని ఆదరించి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్, పీసీసీ ప్రచార కమిటీ సభ్యులు కోల వెంకటేష్, నాయకులు దొండి రమణ, ఎస్.కె బబ్లు, అవెజ్, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.. పట్టణంలోని మామిడిపల్లి సరస్వతి నగర్ యందు గడపగడపకు ప్రచారంలో భాగంగా విస్తృత ప్రచారం నిర్వహించినారు
కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు..
నియోజకవర్గంలోని ఒడ్యాట్ పల్లి అంబేద్కర్ యూత్ సభ్యులు కాంగ్రెస్ పార్టీలో భారి స్థాయిలో చేరారు. వీరందరికీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి కండువా కప్పి ఆహ్వానించారు. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ యొక్క ఆరు గ్యారెంటీలను ప్రజలకు వివరించి, హస్తం గుర్తుకు ఓటేసి, భారీ మెజార్టీతో గెలిపించాలని వినయ్ రెడ్డి తెలిపారు.