కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే అందరికీ న్యాయం

– మాజీ మంత్రి కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం ప్రసాద్‌ కుమార్‌
– అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా
నవతెలంగాణ-కోట్‌పల్లి
కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందని మాజీ మంత్రి కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం ప్రసాద్‌ కుమార్‌ అన్నారు. శనివారం మండల పరిధిలోని కొత్తపల్లి, ఎన్కెపల్లి, ఎన్నారం, బార్వాద్‌, బార్వాద్‌ తండా, మద్గుల్‌ తండా, గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వ హించారు. ప్రసాద్‌ కుమార్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ మైనార్టీ ప్రధాన కార్యదర్శి, మైనార్టీ జిల్లా అధ్యక్షుడు ఆయూబ్‌ అన్సారీ, కాంగ్రెస్‌ మండలా ధ్యక్షుడు నర్సింగ్‌ నాయక్‌, వెంకట్‌ రాంరెడ్డి, ఎంపీ టీసీ నర్సింహారెడ్డి, గ్రామ అధ్యక్షుడు నర్సింలు, రాంచందర్‌ రెడ్డి, రవీందర్‌ రెడ్డి, రాచి రెడ్డి, రాంచందర్‌, ఏసు, అంజయ్య, జగన్నాథ్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.