కాంగ్రెస్‌తోనే బీసీలకు న్యాయం

– చనగాని దయాకర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కాంగ్రెస్‌తోనే బీసీలకు న్యాయం జరుగుతుందని టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్‌ తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ కులగణన చేసి బీసీలకు అవకాశాలు ఇవ్వబోతున్నదని చెప్పారు. బీఆర్‌ఎస్‌ బీసీలకు ద్రోహం చేసిందని విమర్శించారు. రాహుల్‌గాంధీ ఆలోచనను సీఎం రేవంత్‌ రెడ్డి అమలు చేశారని తెలిపారు. గ్రూప్‌ 1 మెయిన్స్‌లో బీసీలకు జీవో 29తో ఎక్కడా నష్టం జరగదని స్పష్టం చేశారు. దీనిపై బీఆర్‌ఎస్‌, బీజేపీలు చేసేవి విషప్రచారమే అని కొట్టిపారేశారు. గ్రామగ్రామాన బీసీలు రాహుల్‌ గాంధీకి, సీఎం రేవంత్‌ రెడ్డికి ధన్యవాదాలు తెలపాలని పిలుపునిచ్చారు.