కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ద్వారానే పేద ప్రజలకు న్యాయం..

– కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్
నవతెలంగాణ-పరకాల : తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక గ్రామసభల ద్వారానే జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ పరకాల పట్టణ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్ తెలిపారు. సోమవారం రోజున స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జనవరి 26 నుండి అర్హులందరికీ మరో నాలుగు పథకాలు ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా, రైతు భరోసా, తెల్ల రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుందని తెలిపారు. పరకాల మున్సిపాలిటీ పరిధిలోని వార్డులు 5, 6, 7, 8, 18, 19, 20 వార్డుల సభ కొత్తమున్సిపల్ కార్యాలయంలో, 3, 4, 15, 16, 17, 22 వార్డులకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, 1 ,2 12, 13, 14 వార్డులకు సి.ఎస్.ఐ పాఠశాలలో, 9, 10, 11, 21 వార్డులకు మాదారంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తారని తెలిపారు. రేపటి నుండి నిర్వహించే గ్రామ సభలను లబ్ధిదారులందరూ వినియోగించుకోవాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా చూడాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కుంకుమేశ్వర్ టెంపుల్ చైర్మన్ కొలుగూరి రాజేశ్వరరావు సమన్వయ కమిటీ సభ్యులు ఎక్స్ ఎంపీపీ రామ్మూర్తి చిన్నలగోనాథ్ బుచ్చు చందర్ కౌన్సిలర్స్ పంజిగిరి జయమ్మ పసుల రమేష్ రఘుపతి గౌడ్ అనిల్ సదానందం గౌడ్ మెరుగు శ్రీశైలం ఎర్రబెల్లి భాస్కర్ రెడ్డి చందుపట్ల రాఘవరెడ్డి దుబాస్ వెంకటస్వామి పోరండ్ల వేణు ఒంటేరు శ్రావణ్ బొమ్మ కంటి చంద్రమౌళి గడ్డం శివ ఎండి బాబా ఏకు బొబ్బిలి బోచ్చు రవికుమార్ సుదమల్ల కిషోర్ కుమార్ జితేందర్ మంద సురేష్ మొగిలి మోటం చందు మరియు తదితరులు పాల్గొన్నారు.