– గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి
– ఐదు గ్యారంటీల అమలుకు సీఎం కషి
నవతెలంగాణ- గజ్వేల్
కాంగ్రెస్ ప్రభుత్వం లోనే పేదలకు న్యాయం జరుగుతుందని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు తూముకుంట నర్సారెడ్డి అన్నారు. మంగళవారం గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక గజ్వేల్ పట్టణంలోనే గత కాంగ్రెస్ ప్రభుత్వం లోనే 2300 మంది నిరుపేదలకు తాను ఇండ్లు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం పేదలను పట్టించుకోలేదన్నారు. తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం కొనసాగుతుందని పేదలను న్యాయం జరుగుతుందన్నారు. పేదల కోసం ఇందిరమ్మ రాజ్యం ఏర్పడదని ఆయన అన్నారు. డబుల్ బెడ్ రూమ్ విషయంలో అధికారులతో చర్చించి న్యాయం చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలో ఐదు గ్యారెంటీలను వెంటనే అమలు చేస్తుందని ఆయన అన్నారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం జరుగుతుందన్నారు. అప్పుటి ముఖ్యమంత్రి కెసిఆర్ అనేక హామీలు ఇచ్చారని ఏ ఒక్కడు కూడా నెరవేరలేదన్నారు. సంగాపూర్ సమీపంలో కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రస్తుతం మల్లన్న సాగర్ నిర్వాసితులను అప్పుడు ప్రభుత్వం వారికి నివాసం కల్పించిందన్నారు. ప్లాట్లు వారికి వచ్చే బెనిఫిట్స్ ఏ స్థాయిలో ఉన్నాయో వాటిని పరిశీలించి వారితో చర్చించాలన్నారు. ఆ తర్వాతేడ్రా పద్ధతిలో తీసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించేందుకు చర్చించవలసి వస్తుందన్నారు. అనేక పనులు పెండింగ్లో ఉన్నాయని అధికారులతో దశలవారు చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పెండింగ్ పనులను పూర్తి చేసినందుకు శాశక్తులకు కషి చేస్తానన్నారు. శాఖల వారీగా గజ్వేల్ లో ఉన్న సమస్యలను ఆయా మంత్రుల దష్టికి తీసుకుపోయి పరిష్కారానికి తన వంతు కషి చేస్తానన్నారు. ప్రజా పాలన కార్యక్రమంలో ప్రజల నుండి తీసుకున్న విజ్ఞప్తుల పై ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వారు పెట్టుకున్న అర్జీలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం ప్రజా పాలన అందిస్తుందన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్న తొమ్మిది మండలాల్లో పెండింగ్లో ఉన్న పనులపై ప్రత్యేక దష్టి పెడతామని ఆయన అన్నారు. గత ప్రభుత్వంలో చేసిన వైఫల్యాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేయదని ఆయన అన్నారు. పేదలకు న్యాయం చేసేందుకు 100 గదాలు స్థలం ఉన్న ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
క్యాలెండర్ ఆవిష్కరణ
సిద్ధిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, గజ్వేల్ నియోజక వర్గ మాజీ శాసనసభ్యులు తుంకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో పిసిసి కార్యదర్శి నాయిని యాదగిరి అధ్యక్షతన నర్సారెడ్డి చేతుల మీదుగా కాంగ్రెస్ 2024వ సంవత్సరం క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో గజ్వేల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మద్దూరి మల్లారెడ్డి, పట్టణ అద్యక్షుడు మొనాగారి రాజు, యువజన కాంగ్రెస్ పట్టణ అద్యక్షుడు హనుమాండ్ల నాగరాజు నేత, పిసిసి మైనారిటీ రాష్ట్ర కార్యదర్శి మొహమ్మద్ ఇక్బాల్,కుకునూర్ పల్లి మండల అద్యక్షులు విరుపాక శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు గోపాల్ రావు,యువజన కాంగ్రెస్ మాజీ తలకొక్కుల ప్రేమ్ కుమార్ నేత, పట్టణ ప్రధాన కార్యదర్శి నక్క రాములు గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మన్నే కపానందం, మైనారిటీ జిల్లా కార్యదర్శి మొహమ్మద్ ఫారూఖ్ జాని, సీనియర్ నాయకులు మహంకాళి చంద్రం, పట్టణ ఉపాధ్యక్షులు బాగమ్మొల్ల మల్లేష్, అడ్వకేట్ ఎన్నేళ్లి స్వామి, తదితరులు పాల్గోన్నారు.