కాంగ్రెస్‌ వస్తేనే పేదలకు న్యాయం

– పేదలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్‌ను గెలిపించాలి
– డీసీసీ ఉపాధ్యక్షుడు బోలుసని భీంరెడ్డి
నవతెలంగాణ-కుల్కచర్ల
పేద ప్రజలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలని డీసీసీ ఉపాధ్యక్షుడు బోలు సని భీంరెడ్డి, మండలాధ్యక్షుడు ఆంజనేయులు ముదిరాజ్‌, బ్లాక్‌ బీ అధ్యక్షుడు కర్రే భరత్‌ కుమార్‌, మండల ప్రధాన కార్యదర్శి గోపాల్‌ నాయక్‌, జిల్లా నా యకులు కుమ్మరిస్వామి అన్నారు. ఆదివారం కుల్క చర్ల మండలం బండవెల్కిచర్లలో ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్‌ 6 గ్యారెంటీ పథకాలను వివరించారు. వారు మాట్లాడుతూ…కాంగ్రెస్‌ అధికారంలో వస్తే పేదలకు న్యాయం జరుగుతుందని అన్ని వర్గాలకూ మేలు జరు గుతుందన్నారు. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్‌కు ఓటు వేసి రామ్మోహన్‌ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
కాంగ్రెస్‌లో పలువురు చేరిక…
కుల్కచర్ల మండల కేంద్రానికి చెందిన పలువురు యువకులు మండల నాయకులు ఆధ్వర్యంలో కాం గ్రెస్‌లో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వా నించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి రామ్మోహన్‌ రెడ్డి గెలుపు నకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎం పీపీ ఆంజిలయ్య గౌడ్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గోవర్ధన్‌, కనకం మొగులయ్య, అంతారం సర్పంచ్‌ కృష్ణ, జలీల్‌, ఘనపూర్‌ మాజీ సర్పంచ్‌ శ్రీను, లేగల శీను, బాలకృష్ణ భాను తదితరులు పాల్గొన్నారు.