
నవతెలంగాణ- కంటేశ్వర్
న్యాయమే గెలిచింది బీజేపీ ఎత్తులు చిత్తయ్యాయి అని నిజామాబాద్ ఎన్ఎస్ యుఐ జిల్లా అధ్యక్షులు వరద బట్టు వేణు రాజు హర్షం వ్యక్తం చేశారు. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి విధించిన రెండేళ్ల శిక్ష పై సుప్రీంకోర్టు స్టే విధించడం పట్ల ఎన్.ఎస్.యు.ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్ ఆధ్వర్యంలో నగరంలోని పులాంగ్ చౌరస్తా వద్ద ఎన్.ఎస్.యు.ఐ నాయకులు మరియు కార్యకర్తలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి బాణాసంచా కాల్చి,మిఠాయిలు పంచడం కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వేణురాజ్ మాట్లాడుతూ రాహుల్ గాంధీపై బీజేపీ ప్రభుత్వం కుట్రపన్ని పరువు నష్టం కేసు ద్వారా అన్యాయంగా రాహుల్ గాంధీపై అనర్హత వేటు చేయాలని చూసిందని కానీ వారి కుట్రలు విఫలమై చివరికి న్యాయమే గెలిచిందని వరదబట్టు వేణురాజ్ అన్నారు. బీజేపీ ఎన్ని ఎత్తులు వేసిన అవన్నీ చిత్తయాయని చివరికి న్యాయం గెలిచిందని కుట్రపూరితంగా రాహుల్ గాంధీ పై కేసు పెట్టి అనర్హత వేటు వేయాలని చూశారని కానీ సుప్రీంకోర్టు స్టే విధించి బిజెపి చేస్తున్న అప్రాజస్వామిక కుట్రలను తిప్పి కొట్టిందని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు పట్ల దేశవ్యాప్తంగా ప్రతి సామాన్య పౌరుడు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారని ప్రజల్లో చట్టం న్యాయం పట్ల విశ్వాసం పెరిగిందని ఆయన అన్నారు. బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు గళం విప్పడమే కాకుండా ప్రధాని మిత్రులైన అంబానీ ఆదానికి బీజేపీ ప్రభుత్వం ప్రజాధనాన్ని దోచిపెడుతున్న తీరు పట్ల అలుపెరుగని పోరాటం చేశారని దీంతో పార్లమెంటులో రాహుల్ గాంధీ గారిని ప్రశ్నించకుండా ఆయనపై అనార్హత వేటు వేయాలని చూసిందని ఆయన అన్నారు. కానీ రాజ్యాంగ స్ఫూర్తితో నడిచే ప్రజాస్వామ్య దేశంలో బీజేపీ చేస్తున్న రాజ్యాంగ విరుద్ధమైన, అప్రజాస్వామిక విధానాలు చెల్లవని సుప్రీంకోర్టు స్టే విధించడం ద్వారా తెలిసిపోయిందని ఆయన అన్నారు. సక్రమంగా దేశాన్ని పాలించడం బిజెపికి చేతగాక వారి పాలనలో జరిగే అవినీతి అక్రమాలను ప్రశ్నించినందుకు రాహుల్ గాంధీ గొంతు నొక్కే ప్రయత్నం చేశారని కానీ చివరికి న్యాయమే గెలిచిందని ఏ రాహుల్ గాంధీ ని అయితే పార్లమెంటులో అడుగుపెట్టకుండా కుట్రలు చేశారు. అదే రాహుల్ గాంధీ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయతీరాలకు చేర్చి ప్రధానమంత్రిగా పార్లమెంట్లో అడుగుపెడతారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్.ఎస్.యు.ఐ నిజామాబాద్ జిల్లా నాయకులు అష్రఫ్ నిఖిల్ రెడ్డి కిరణ్ శివ అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.