దోమల పెంటలో న్యాయం గెలిచింది..

Justice won in mosquito breeding..– పంచాయితీ అధికారులకు చెంపపెట్టుగా మారిన హైకోర్టు తీర్పు..
– నేలమట్టం చేసిన సముదాయాలను తిరిగి సొంత ఖర్చులతో నిర్మించి ఇవ్వాలన్న కోర్టు తీర్పు 
నవతెలంగాణ – అచ్చంపేట 
కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ దోమల పెంట ఇన్చార్జి పంచాయతీ కార్యదర్శి ఏకపక్షంగా వ్యవహరించి గత 25 ఏళ్లుగా ఆవాసం ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్న వారి నివాస సముదాయాలను జెసిబి సాయంతో బలవంతంగా కూల్చారు.  దీంతో ఆ కుటుంబాలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. జరిగిన అన్యాయం గురించి బాధితుడు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టును  ఆశ్రయించారు. బాధితుని పక్షాన నిలిచిన హైకోర్టు బాధితులకు న్యాయం చేస్తూ తీర్పు వెల్లడించింది. పంచాయతీరాజ్ శాఖ అధికారులు సొంత నిధులతో కూల్చిన నివాస కేంద్రాలను తిరిగి నిర్మించాలని ఆదేశాలిచ్చారు. ఎందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి నాగర్ కర్నూలు జిల్లా దోమల పెంట గ్రామంలో కటకం మహేష్, నాగలక్ష్మి గ్రామపంచాయతీ అనుమతితో నిర్మించుకున్నారు. పంచాయతీ అనుమతి లేదు అని కార్యదర్శి బీముడు  ఏకపక్షంగా వ్యవహరించి కోర్టులో స్టే ఉన్నప్పటికీ పట్టించుకోకుండా జెసిబి సాయంతో నివాసాన్ని కూల్చారు.. పంచాయతీ అధికారి తీరును ఖండిస్తూ రాష్ట్ర హైకోర్టు నో ఆశ్రయించారు. తమకు జరిగిన అన్యాయం గురించి వివరించారు గ్రామపంచాయతీ అధికారుల తీరును జిల్లా పంచాయతీ అధికారి పంచాయతీ కార్యదర్శి లను కోర్టుకు పిలిచి మొట్టికాయలు వేసింది. బాధితులు ప్రభుత్వ నిబంధన ప్రకారం అన్ని హక్కులు కలిగి ఉన్నప్పటికీ కోర్టులో స్టే ఉన్న వాటిని పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నేలమట్టం చేసిన భవనాలను సొంత ఖర్చులతో నిర్మించి ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. జిల్లా పంచాయతీ అధికారి అనుమతి లేకుండా స్థానికంగా ఉన్న ఇన్చార్జించార్జి సెక్రెటరీ భీముడు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం పట్ల అవినీతి అక్రమాలకు తీవ్రస్థాయిలో పాల్పడినట్లు తెలుస్తుంది. పంచాయతీ కార్యదర్శి బీముడు పైన అనేక ఆరోపణలు ఉన్నాయి అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఆశ్రమలు సంపాదించుకుంటున్నానని గ్రామాల్లో చర్చ బహిర్గతంగా జరుగుతుంది. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించడంలో పంచాయతీ కార్యదర్శి బీముడు దిట్ట అని ప్రచారం జరుగుతుంది.
న్యాయం గెలిచింది: బాధితుడు, మహేష్..
ఎన్నో ఏండ్లుగా ఆవాసాలను ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తుంటే పంచాయతీ కార్యదర్శి ఏకపక్షంగా వ్యవహరించి తమ జీవితాలతో ఆడుకొని బజారుపాలు చేశారని అధికారుల తీరును తప్పుపడుతూ బాధితులకు న్యాయం చేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడం పట్ల మహేష్ స్థానాల పట్ల ప్రజలకు నమ్మకం కల్పిస్తుందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. అధికారులు పాలకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ తప్పులు చేస్తూ పోతుంటే న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోమని ఆయన అన్నారు. హైకోర్టు ఆయనకు న్యాయం చేయడం పట్ల న్యాయవ్యవస్థకు కృతజ్ఞతలు తెలిపారు. ఏకపక్షంగా వివరించి నన్ను బజారు పాలు చేసిన పంచాయతీ సెక్రటరీ భీముడు నాయక్ పై చట్ట ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.