నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ, ఏపీ ఉభయ హైకోర్టుల ఉద్యోగుల క్రెడిట్ సొసైటీ అధ్యక్షులుగా జస్టిస్ కె సురేందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా హరయ్య, కార్యదర్శి హెచ్ ప్రద్యుమ్న కుమార్, జాయింట్ సెక్రెటరీగా అరుణ్‌కుమార్, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా బి ఝాన్సీ లక్ష్మిబాయి, ఎ రజని, సిహెచ్ సరోజిని, సయ్యద్ రియాజ్, ఎండీ హమీద్, మునుస్వామి, వెంకటేశ్, సుదర్శన్ ఎన్నికయ్యారు. తెలంగాణ, ఏపీ ఉభయ హైకోర్టుల ఉద్యోగుల క్రెడిట్ సొసైటీ సమావేశాన్ని సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించారు.