పరిహరమందజేసి న్యాయం చేయాలి

– అధికారుల తీరుపై గూడెం బాధితుల అవేదన 
– న్యాయం చేయాలని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి
నవతెలంగాణ – బెజ్జంకి 
గత 30 ఎండ్లుగా నిర్మించుకున్న పశువుల,గొర్రెల పాకలను,వృద్ధులు నిర్మించుకున్న రెకుల షెడ్లను మండల అధికార యంత్రాంగం ముందస్తు సమాచారమివ్వకుండా తొలగించి విధ్వంసక చర్యలకు పాల్పడ్డరని, పరిహరమందజేసి మాకు న్యాయం చేయాలని గూడెం గ్రామంలోని బాధితులు అదివారం అవేదన వ్యక్తం చేశారు. శనివారం మధ్యాహ్న సమయంలో గూడెం గ్రామ శివారులోని 321 సర్వే నంబర్ యందు నిర్మాణాలను అధికార యంత్రాంగం తొలగించడం దుశ్ఛర్యేనని, ప్రభుత్వ అభివృద్ధి పనులకు మేము అటంకం కాదని, అధికారులు తొలగించిన పశువుల,గొర్రెల పాకలు,వృద్ధుల నివాసాలకు నష్టపరిహరమందజేసి అదుకోవాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు బాధితులు విజ్ఞప్తి చేశారు.