ఉద్యమ కళాకారులకు న్యాయం చేయాలి 

Justice should be given to the artists of the movementనవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
తెలంగాణ ఉద్యమంలో ఉద్యమమే ఊపిరిగా ఉద్యమించి ఆడి పాడిన ఉద్యమ కళాకారులకు గత ప్రభుత్వం అన్యాయం చేసిందని , కాంగ్రెస్ ప్రభుత్వం కళాకారులకు న్యాయం చేయాలని హుస్నాబాద్ కళాకారులు కోరారు. బుధవారం  హుస్నాబాద్ లో ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం 550 మందిని మాత్రమే కళాకారుల గుర్తించి ఉపాధి కల్పిస్తూ సాంస్కృతిక శాఖలో ఉద్యోగాలు కల్పించిందన్నారు. నిరుద్యోగ ఉద్యమ కళాకారులు ఉపాధి అవకాశాలు లేక కళనే నమ్ముకున్న కళాకారులకు కన్నీళ్లే మిగిల్చిందన్నారు. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఎంత మొరపెట్టుకున్న మా గోడు వినిపించుకోలేదని ,హైకోర్టు ఆదేశాల మేరకు సెకండ్ లిస్ట్ వేస్తున్నామంటూ ఇంటర్వ్యూ పెట్టి మళ్లీ వాళ్ళనే రిక్రూట్ చేశారన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం నిజమైన ఉద్యమ నిరుద్యోగ కళాకారులమైన మాకు న్యాయం చేస్తూ ఉపాధి కల్పించాలాన్నారు. ఈ కార్యక్రమంలో,కొడముంజ రవీందర్, తాడూరి సురేష్, కనకం వేంకట్, గడిపె చిన్న, బోనగిరి శ్రీకాంత్, బోయినీ సుమన్ , పొన్నాల అశోక్ , పున్న సంపత్ తదితరులు పాల్గొన్నారు.