రైతుల పట్ల మొండి వైఖరిని విడిచి రైతులకు న్యాయం చేయాలని,బొమ్మలరామారం మండలం కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేయడం జరిగింది. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ..రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గారెంటీ లు ,ఎకరాకు 15 వేల రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తానని తెలంగాణ ప్రజలకు మాయ మాటలు చెప్పి ఓట్లు దండుకొని, అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కారు మాట మార్చి ఎకరాకు 12 వేల రూపాయలు ఇస్తామని, హామీని విస్మరించడం జరిగిందని,కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ 2 లక్షల వరకు ఏకకాలంలో చేస్తానని మాట ఇచ్చి చేయలేక చేతులెత్తేసిన ప్రభుత్వవం అన్నారు. రైతుల పట్ల మొండి వైఖరిని విడిచి ప్రభుత్వం వెంటనే రైతులకు ఇచ్చే హామీలను అమలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, టిఆర్ఎస్ కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు.