– ప్రభుత్వానికి ఎస్సీ, ఎస్టీ టీచర్స్ ఫెడరేషన్ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
జీవో 317తో నష్టపోయిన ఉపాధ్యాయులకు తగిన న్యాయం చేయాలని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ టీచర్స్ ఫెడరేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాడి రాజన్న అధ్యక్షతన ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన సర్వసభ్య సమావేశం ఉపాద్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి పలు తీర్మాణాలు చేసింది. మండల కేంద్రంలోని ఒక పాఠశాలను ఎంపిక చేసి అన్ని వసతులతో ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేయాలనీ, పాఠశాల పర్యవేక్షణకు ప్రత్యేక తనిఖీ విభాగాన్ని ఏర్పాటు చేయాలనీ. తల్లిదండ్రుల అభిప్రాయాలను సేకరించి బడులను పునర్వ్యవస్థీకరించాలని కోరారు. రేషనలైజేషన్ ప్రక్రియకు సంబంధం లేకుండా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగునంగా ఉపాధ్యాయ పోస్టులను మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎస్సీ, ఎస్టీ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి చరణ్‌దాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.