నవతెలంగాణ -హైదరాబాద్
రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సుజోయ్ పాల్‌తో మంగళవారం హైకోర్టు ఫస్ట్ కోర్టు హాల్లో చీఫ్ జస్టిస్ అలోక్ ఆరథే ప్రమాణ స్వీకారం చేయించారు. మధ్యప్రదేశ్ హైకోర్టు నుంచి జస్టిస్ సుజోరు పాల్ బదిలీపై ఇక్కడికి వచ్చారు. 1090లో లాయర్‌గా ఎన్‌రోల్ అయిన ఆయన అదే మధ్యప్రదేశ్ హైకోర్టుకు 2011 మే 27న న్యాయమూర్తి అయ్యారు. జస్టిస్ సుజోయ్ పాల్ పదవీ స్వీకరణోత్సవానికి హైకోర్టు న్యాయమూర్తులు, ఏజీ, బార్ కౌన్సిల్ చైర్మెన్, అదనపు సొలిసిటర్ జనరల్, డిప్యూటీ సొలిసిటర్ జనరల్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, జస్టిస్ సుజోయ్ పాల్ కుటుంబసభ్యులు హాజరయ్యారు. ఆ తర్వాత ఫస్ట్ కోర్టులో చీఫ్ జస్టిస్‌తో కలిసి జస్టిస్ సుజోయ్ పాల్ కేసుల్ని విచారించారు. ఈ నెల 28న కలకత్తా హైకోర్టు నుంచి బదిలీపై రాబోయే జస్టిస్ మౌసమీ భట్టాచార్య ప్రమాణస్వీకారం చేస్తారు.