రాజకీయ కక్ష సాధింపు లో భాగంగా తన పై, పార్టీ నాయకుల పై తప్పుడు కేసులు పెట్టారని, అయినా చివరకు న్యాయం గెలిచిందని ఏఐఎంఐఎం జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ రజిఉద్దీన్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ ముఖ్య నాయకులు 6 మందిపై గత మార్చి నెలలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో మంత్రి కోమటిరెడ్డి, పోలీసుల విధులకు అడ్డoకి కలిగించారాని భూటకపు కేసు క్రైమ్ నెంబర్ 76/2024 గా నమోదు చేసారని పేర్కొన్నారు. ఈ విషయమై అభియోగదారులు రాష్ట్ర అత్యన్నత న్యాయ స్థానం లో క్వాష్ పిటిషన్ ఫైల్ చేశారని, నెంబర్ 8769/2024 పిటిషన్ ను విచారించిన జస్టిస్ సుజనా ధర్మశానం ఆ కేసుని తప్పుడు కేసు గా తీర్పునిస్తూ ముద్దాయిలకు ఆ కేసు నుండ ఉపశమనం కలిగిస్తూ కేసును కొట్టివేసిందని తెలిపారు. కోర్టు తీర్పుతో పార్టీ కార్యవర్గం హర్ష వ్యక్తం చేసిందని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో పలువురు ఏఐఎంఐఎం నాయకులు పాల్గొన్నారు.