జూటా మాటల పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలి

నవతెలంగాణ – మిరుదొడ్డి 
మాయమాటలతో హామీ ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్న జూటపార్టీలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు లోకసభ ఎన్నికల్లో  కారు గుర్తుకు ఓటు వేసి బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్  సీనియర్ నాయకులు శ్రీనివాస్  అన్నారు. దుబ్బాక నియోజకవర్గం అక్బర్ పేట- భూంపల్లి మండలం మోతేలో అభ్యర్థి వెంకటరామిరెడ్డికి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  భాగంగా ప్రతి ఇంటి నుండి బీఆర్ఏస్ పార్టీకి మంచి ఆదరణ లభిస్తుందన్నారు. గతంలో బీజేపీ పార్టీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మాయమాటలు చెప్పి ఓట్లు వేసుకొని మాయమయ్యారన్నారు.  కాంగ్రెస్ పార్టీ  అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను వంచించారన్నారు. మళ్లీ ఏ ముఖం పెట్టుకొని ప్రజల వద్దకు వస్తున్నారని  ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో కమ్మర్ రవి, రంజిత్, రాజేశ్వర్, ch నర్సింలు, gరమేష్, m. చంద్రం,  బుచ్చులు, G.యాదగిరి, G. కళాధర్,  మురళి. M. మహేష్ పలువురు పాల్గొన్నారు